వచ్చే మార్చి నాటికి ప్రతి పల్లెకు, గూడానికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీరు అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హామీ ఇచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలో 6 కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ మానిటరింగ్ కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నేతలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.
'మార్చి నాటికి ప్రతి పల్లెకు తాగునీరు అందిస్తాం' - మంత్రి ఎర్రబెల్ల దయాకర్రావు వార్తలు
మిషన్ భగీరథ పథకాన్నికేంద్రం ప్రశంసించి... పురస్కారాలు ఇచ్చింది కానీ... ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వచ్చే మార్చి నాటికల్లా ప్రతి పల్లెకు, గూడానికి భగీరథ నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
'మార్చి నాటికి ప్రతి పల్లెకు, గూడానికి తాగునీరు అందిస్తాం'
ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథకు రూపకల్పన చేశారని అన్నారు. భగీరథ పథకాన్ని కేంద్రం ప్రశంసించి... పురస్కారాలు అందజేసిందని కానీ... ఒక్క రూపాయీ సాయం చేయలేదని విమర్శించారు.
ఇదీ చూడండి:బాటిళ్లలో రానున్న మిషన్ భగీరథ నీళ్లు..!