వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెరాస జెండా ఎగురవేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో జరుగుతోన్న అభివృద్ధి పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో చేసిన అభివృద్ధిని కార్పొరేటర్లు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని తెలిపారు.
ఓరుగల్లులో తెరాసకే మరోసారి పట్టం: ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేటెస్ట్ న్యూస్
వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎల్లవేళలా అండగా ఉండే వారినే ప్రజలు ఆదరిస్తారని ఆయన తెలిపారు. నగరంలో జరుగుతోన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓరుగల్లులో తెరాసకే మరోసారి పట్టం: ఎర్రబెల్లి
ఫిబ్రవరి నాటికి ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని తెలిపిన మంత్రి... భాజపా నాయకులు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. ఎల్లవేళలా అండగా ఉంటూ కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్న వారినే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఓరుగల్లు వాసులు మరోమారు తెరాస నాయకులకు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఆస్తికోసం తల్లి అంత్యక్రియలకు అడ్డుపడిన పుత్రరత్నం