Minister Errabelli comments on BJP leaders: ఇకపై తెరాస ప్రభుత్వం, నాయకులపై కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భాజపా నాయకులను హెచ్చరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా భాజపా నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హనుమకొండలో నూతనంగా ఎన్నికైన జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రైవేటుపరం
కాజీపేట్‌లో రైల్వే కోచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చినా కూడా ఇవ్వలేదని.. భాజాపా నాయకులు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం మంజూరు చేయడం లేదని ఆరోపించారు. దేశాన్ని కేంద్రం మోసం చేస్తోందని.. అన్ని ప్రభుత్వ సంస్థలనూ ప్రైవేటు పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నేతలను ప్రజలు ఎక్కడిక్కడే అడ్డుకునే రోజులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:Congress Internal Politics: పార్టీలో అంతర్గత రాజకీయం.. కాంగ్రెస్ నేతల చర్యలు ఊహాతీతం..!