తెలంగాణ

telangana

ETV Bharat / state

Errabelli On Agnipath: యువత శాంతియుతంగా పోరాడాలి: ఎర్రబెల్లి - ఎర్రబెల్లి దయాకర్‌ రావు

Errabelli On Agnipath: దేశ భద్రతకే ముప్పు తెచ్చే అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు డిమాండ్ చేశారు. దేశ యువతకు ప్రధాని క్షమాపణ చెప్పాలని కోరారు. హనుమకొండ జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Errabelli On Agnipath
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

By

Published : Jun 20, 2022, 8:17 PM IST

Errabelli On Agnipath: భాజపా అధికారం నుంచి దిగిపోతేనే దేశం బాగుపడుతుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. దేశ యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం దిక్కుమాలిన పాలనకు అగ్నిపథ్ ఆందోళనలే నిదర్శనమని మండిపడ్డారు. హనుమకొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

నిరుద్యోగ యువకులు తొందరపడి ఎలాంటి ఆవేశాలకు లోను కావొద్దు. ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు లేదంట. ఇది ఎంత ఘోరం. ఇది ఎంత మొండి వైఖరి అండి. ఇలాంటి పాపానికి ఒడిగడతారా? రెండేళ్లు శిక్షణ తీసుకున్న వారికి మళ్లీ టెస్టులు పెడతారా? నిరుద్యోగ యువకులు శాంతియుతంగా పోరాటం చేయాలనేదే మా విజ్ఞప్తి.

-ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

జవాన్లకు, రైతులకు న్యాయం చేయలేని ప్రధాని మోదీ... అధికారం నుంచి దిగిపోతేనే దేశం బాగుపడుతుందన్నారు. యువకులు చనిపోతున్నా.. మానవత్వం కూడా లేకుండా అగ్నిపథ్ నియామకాల షెడ్యూళ్లు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం పనిచేసే సైనికుల గురించి భాజపా నేతలే హేళన చేస్తూ మాట్లాడటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అస్తవ్యస్త విధానాలతో దేశంలో నిరుద్యోగాన్ని పెంచుతోందని మండిపడ్డారు. హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా యువత శాంతియుతంగా పోరాటం చేయాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఇవీ చదవండి:

సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఇంటెలిజెన్స్‌ అధికారుల తనిఖీలు

జూదంలో భార్యను ఓడిన వ్యక్తి.. ఇతరులతో శారీరక సంబంధానికి ఒత్తిడి

ABOUT THE AUTHOR

...view details