గిరిజన యూనివర్సిటీతో పాటు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడంలో కేంద్రం.. తెలంగాణ ప్రజలను మభ్య పెడుతూ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మండిపడ్డారు. వరంగల్ నగరంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'కోచ్ ఫ్యాక్టరీని రాష్ట్రానికి రాకుండా చేశారు' - ఎంపీ బండ ప్రకాశ్
రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేసిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. కోచ్ ఫ్యాక్టరీని రాష్ట్రానికి రాకుండా చేసి, ఉత్తర ప్రదేశ్కు తరలించిందని ఆరోపించారు. వరంగల్ నగరంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'కోచ్ ఫ్యాక్టరీని రాష్ట్రానికి రాకుండా చేశారు'
కేంద్రం.. కోచ్ ఫ్యాక్టరీని రాష్ట్రానికి రాకుండా చేసి, ఉత్తర ప్రదేశ్కు తరలించిందని మంత్రి ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్వి అర్థరహిత వ్యాఖ్యలంటూ మండిపడ్డారు. గడిచిన ఆరేళ్లలో సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కేంద్రం పైసలు లేకుండా రాష్ట్ర పథకాలున్నాయా?: బండి సంజయ్