తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2019, 6:43 PM IST

ETV Bharat / state

మెగా ఉద్యోగమేళాకు విశేష స్పందన

వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉద్యోగమేళాకు విశేష స్పందన లభించింది.

వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగమేళా

వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగమేళా

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగమేళాకు అనూహ్య స్పందన లభించింది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళాను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రారంభించారు.

ఈ ఉద్యోగ మేళాలో సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా వందలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. నిరుద్యోగులు ఇంతటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ సూచించారు. ఉద్యోగం రాని వారు నిరుత్సాహ పడ్డవద్దని, మళ్లీ కొలువు సాధించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​లో హాస్టల్​ బుకింగ్​... అందులోనూ డిస్కౌంట్​...

ABOUT THE AUTHOR

...view details