ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన నేడు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి జూలై 5 వరకు జరగనున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు వెల్లిడించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, హైదరాబాద్లోని జేఎన్టీయూ, ఏవీ కళాశాల, పీజీఆర్సీడీఈ ఉస్మానియా క్యాంపస్, నిజాం కళశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా, నిర్దేశించిన రోజున హాజరు కావాలని కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. అనంతరం మెరిట్ జాబితా యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలిపారు.
ఎంసెట్ వైద్యవిద్యా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం - certificates verification
ఎంసెట్ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ధ్రువపత్రాల పరిశీలన ఈ రోజు మొదలైంది. 5 కేంద్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
ఎంసెట్ వైద్యవిద్యా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం