ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట వైష్ణవి గ్రాండ్స్లో నిర్వహించిన నూతన వధూవరుల వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. వైద్య వృత్తిలో ఉండే వధూవరుల కోసం ఏర్పాటు చేసిన ఈ పరిచయ వేదికకు సుమారు రెండు వందలపైగా యువతీ యువకులు తల్లిదండ్రులతో తరలివచ్చారు. తమ కుటుంబానికి తగిన సంప్రదాయం కలవారిని ఎంపిక చేసుకోవడానికి ఈ పరిచయ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఈనాడు పెళ్లిపందిరి వారికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
'వైద్య వధువరుల వివాహ పరిచయ వేదిక' - WARANGAL URBAN DISTRICT
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో ఈనాడు ఆధ్వర్యంలో నూతన వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి యువతీ యువకులు వారి తల్లిదండ్రులు తరలొచ్చారు.
పరిచయ వేదికకు సుమారు రెండు వందలపైగా హాజరు