అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కల్యాణ లక్ష్మి పథకంతో పేద కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. అలాంటి నేతకు మరింత బలం చేకూర్చేలా ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పర్యటన - mantri-erraballi-compaign-in-inavolu
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఐనవోలులో పర్యటించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. తెరాసకు 16 సీట్లు ఇచ్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించేవిధంగా సహకరించాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి