ఇచ్చిన హామీలు నెరవేర్చని తెరాస వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లికుంట 17వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్నారు. మిషన్ భగీరథలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన బాగోతాలు బయటపెడతానని హెచ్చరించారు. కాంట్రాక్టు పనులతో ఎన్నో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. తెరాస-భాజపాల జోడి రాష్ట్రంలో ఒకలా.. రాష్ట్రం దాటాక మరోలా ఉంటుందని అన్నారు.
తెరాస-భాజపాలతో నగరానికి ఒరిగిందేం లేదు : రేవంత్ రెడ్డి - revanth reddy campaign for greater warangal election
తెరాస-భాజపాల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో హస్తం అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రేవంత్.. ఆ రెండు పార్టీల వల్ల నగరానికి జరిగిన అభివృద్ధి ఏం లేదని తెలిపారు.
ఎంపీ రేవంత్ రెడ్డి, వరంగల్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు
కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే కానీ.. తెరాస, భాజపా చేసిందేం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజల కనీస అవసరాలు తీర్చని తెరాసకు ఓటు వేయొద్దని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ప్రశ్నించే గొంతుకకు బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి :మాజీ మంత్రి ఎమ్మెస్సార్ కన్నుమూత