రాష్ట్రంలో జరుగబోయే ప్రతి ఎన్నికలో తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా మహాజన సోషలిస్టు పార్టీ నిలుస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం రాజ్యాధికారం పేరుతో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. త్వరలో జరుగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరుఫున అభ్యర్థిని బరిలో నిలపబోతున్నామని ప్రకటించారు.
తెరాసకు మేమే ప్రత్యామ్నాయం : మంద కృష్ణ మాదిగ - వరంగల్లో మహాజన సోషలిస్టు పార్టీ సమావేశం
అట్టడుగు వర్గాల అభివృద్ధికి మహాజన సోషలిస్టు పార్టీ పాటు పడుతుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. త్వరలో జరుగబోయే నాగర్జున సాగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరుపున అభ్యర్థిని బరిలో నిలుపుతున్నామని ఆయన ప్రకటించారు.
తెరాసకు మేమే ప్రత్యామ్నాయం: మంద కృష్ణ మాదిగ
అట్టడుగు వర్గాల అభివృద్ధికి మహాజన సోషలిస్టు పార్టీ పాటు పడుతుందని మంద కృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన నడుస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే తెరాస, భాజపా నేతలు విమర్శించుకుంటారన్న ఆయన ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోండి: మంత్రి సబిత