తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లోనే శానిటైజర్​ తయారు.. ఎలాగో చూడండి

కరోనా ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేందుకుగాను శానిటైజర్లను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన ఇంట్లోనే శానిటైజర్లను తయారుచేసుకోవచ్చని వరంగల్​ నిట్ కెమిస్ట్రీ ఆచార్యుడు రామచంద్రయ్య ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం.

Made of home sanitizer See how warangal nit professor
ఇంట్లోనే శానిటైజర్​ తయారు.. ఎలాగో చూడండి

By

Published : Apr 12, 2020, 11:48 AM IST

కొవిడ్​-19 కారణంగా శానిటైజర్లకు మార్కెట్​లో డిమాండ్​తోపాటు ధరలు కూడా పెరిగిపోయాయి. అయితే డబ్ల్యుహెచ్​వో నిబంధనలకు అనుగుణంగా మన ఇంట్లోనే శానిటైజర్లను తయారు చేయవచ్చని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వివరించారు. నిట్ కెమిస్ట్రీ ఆచార్యుడు రామచంద్రయ్య ఆ తయారీని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.

75 ఎమ్​ఎల్​ ఐసో ప్రొపైల్ ఆల్కహాల్, 1.5 ఎమ్​ఎల్​ గ్లిసరిన్, 0.5 ఎమ్​ఎల్​ హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాలకు 20 ఎమ్​ఎల్​ నీరు లేదా డిస్టిల్ వాటర్లను కలపడం ద్వారా సొంతంగా నాణ్యమైన శానిటైజర్​ని తయారు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. శానిటైజర్ అందుబాటులో లేని వారు సబ్బుతో తరచూ చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. కళ్లు, ముక్కు, నోరు వంటి భాగాలను తాకకుండా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, బయటికి వెళ్లినప్పుడు ఇతరులతో కనీస దూరాన్ని పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.

ఇంట్లోనే శానిటైజర్​ తయారు.. ఎలాగో చూడండి

ఇదీ చూడండి :ఔషధాల లేమి... పొంచి ఉన్న ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details