వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐదు వేలకు పైగా కేసులు నమోదు చేశామని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
'వరంగల్ కమిషనరేట్ పరిధిలో 5వేలకు పైగా లాక్డౌన్ ఉల్లంఘన కేసులు' - వరంగల్ సీపీ తరుణ్ జోషి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నట్టు సీపీ తరుణ్ జోషి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Warangal news
అంతకు ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో వరంగల్ బస్స్టాండ్ ప్రాంగణంలో 80 మందికి పైగా యాచకులు, వృద్ధులు, అనాథలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని... అనవసరంగా ఎవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి:మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు