లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో... పోలీసులు అప్రమత్తమయ్యారు.
వరంగల్ నగరంలో లాక్డౌన్ అమలుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చే వాహనదారులను కట్టడి చేస్తున్నారు. పలు చోట్ల కేసులు నమోదు చేసి.. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పలు చోట్ల రద్దీ..
వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లోని అన్ని కూడళ్ల వద్ద విస్తృత తనిఖీలు చేశారు. వైద్యసేవలు...ఇతరత్ర అత్యవసర సేవల కోసం వచ్చినవారినే అనుమతించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన సడలింపుతో నగరంలో పలు చోట్ల రద్దీ నెలకొంది. ప్రజలు ఒకేసారి నిత్యావసర సరకులు, కూరగాయల కోసం ఇళ్ల నుంచి బయటకి రావడంతో... రద్దీ ఏర్పడింది. వరంగల్ గ్రామీణ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ లాక్డౌన్ పటిష్ఠంగా అమలు దిశగా చర్యలు తీసుకున్నామని వరంగల్ ఏసీపీ బాలస్వామి తెలిపారు.
ఇదీ చూడండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు