వరంగల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఇవాళ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరారు. నగరంలోని రుద్రమదేవి కూడలిలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువకులు పెద్ద సంఖ్యలో కమలం గూటికి చేరారు. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం భాజపా అని ఆయన పునరుద్ఘాటించారు.
భాజపాలోకి వలసలు... ఆహ్వానించిన లక్ష్మణ్ - warangal urban
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు వరంగల్ నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. రుద్రమదేవి కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భాజపాలోకి వలసలు... ఆహ్వానించిన లక్ష్మణ్