KTR on Warangal Tech Center: ఓరుగల్లుకు ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయి. తాజాగా వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు యూఎస్‌కు చెందిన ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ త్యాగరాజన్.. మంత్రి కేటీఆర్‌తో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే సైయంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్ నుంచి ఆపరేట్ చేస్తుండగా... వీటి సరసన జెన్‌పాక్ట్ చేరనుంది.
KTR on Warangal Tech Center: 'జెన్‌పాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం' - జెన్‌పాక్ట్
KTR on Warangal Tech Center: వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు జెన్‌పాక్ట్ సంస్థ ముందుకు వచ్చింది. జెన్‌పాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం అవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR on Warangal Tech Center
వచ్చే ఆరునెలల్లో వరంగల్‌లో ఈ టెక్ సెంటర్ సేవలను ఆరంభిస్తుందని.. తద్వారా వరంగల్‌లో 250 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. జెన్‌పాక్ట్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జెన్‌పాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం అవుతుందని మంత్రి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:GHMC Ward Volunteer Committees : జీహెచ్ఎంసీలో వార్డు వాలంటీర్ కమిటీలు