వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవాలయంలోని శ్రీ వీరభద్రస్వామి దర్శనాలను నిలిపివేశారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్జిత సేవలు, దర్శనాలను నేటి నుంచి మే 15 వరకు నిలిపివేస్తున్నట్లుగా ఆలయ ఈవో వెంకన్న తెలిపారు.
కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనాలు నిలిపివేత - తెలంగాణ వార్తలు
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. నేటి నుంచి మే 15 వరకు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కొత్తకొండ ఆలయం మూసివేత, వీరభద్రస్వామి ఆలయం
ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రాతః కాల పూజ, బాల భోగము, మహా వేదన, సాయంకాల పూజ చేసి ద్వారబంధనం చేస్తామని వెల్లడించారు. భక్తులు ఆలయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.