వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఇంట్లో విషాదం నెలకొంది. సురేఖ పుట్టిన రోజునే ఆమె సోదరుడు వేణు గుండె పోటుతో మృతి చెందారు. హన్మకొండలో నివాసం ఉంటున్న కొండా సురేఖ సొంత సోదరుడు వేణుకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడం వల్ల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో గుండెనొప్పి ఎక్కవ అయినందున ఆయన మరణించారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ సోదరుడి మృతదేహంపై పడి బోరున విలపించారు.
కొండా సురేఖ పుట్టినరోజే... ఇంట్లో విషాదం
కొండా సురేఖ ఇంట్లో ఆమె పుట్టిన రోజునే విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేఖ సోదరుడు వెేణు గుండెపోటుతో మరణించారు.
కొండా సురేఖ సోదురుడు మృతి