తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ చిన్నారుల సాయం 12 లక్షలు - money for old people

వాళ్లు పిల్లలు. వృద్ధులకు తమ వంతుగా అండగా నిలవాలనుకున్నారు. దాచుకున్న సొమ్మును, ఇతరుల నుంచి సేకరించిన డబ్బును ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.

చిన్నారుల సాయం

By

Published : Mar 11, 2019, 5:58 PM IST

చిన్నారుల సాయం
వరంగల్​ పట్టణ జిల్లా హన్మకొండలో పబ్లిక్ పాఠశాల విద్యార్థులు...వృద్ధుల బాగోగులు చూసే హెల్పేజ్​ సంస్థకు 12 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మానవ సేవేమాధవ సేవగా భావించిన చిన్నారులు తాము దాచుకున్న సొమ్మూ... తల్లిదండ్రులు, ఇతరుల నుంచి సేకరించిన మొత్తాన్ని వయసుపైబడ్డ వారికి ఇచ్చి ఆదర్శంగా నిలిచారు.

పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో నగదు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు పాఠశాల ప్రిన్సిపల్, డైరెక్టర్‌ నాగేశ్వర్​రావు అందచేశారు. చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో ముందుకొచ్చి సాయం చేశారని సంస్థ ప్రతినిధులు ప్రశంసించారు. ఇందులో భాగస్వాములైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details