కాజీపేట వంతెనపై అర్ధరాత్రి సమయంలో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.... లారీ డ్రైవర్‌కు కాలు విరగటం వల్ల ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరగటం వల్ల వంతెనపై కిలోమీటర్ మేర రెండు గంటలకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. కడిపికొండ వంతెన మీదుగా పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు.
కాజీపేట వంతెనపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కాజీపేట వంతెనపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొని ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌కు కాలు విరిగింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.
కాజీపేట వంతెనపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు