తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2021, 5:19 AM IST

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కోచ్‌ ఫ్యాక్టరీ రగడ

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ... కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశం...కాక రగిలిస్తోంది. ఫ్యాక్టరీ ఇవ్వకపోతే.... పోరాటం తప్పదని తెరాస విమర్శిస్తుంటే... కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చినా నిలుపుకోలేకపోయారని భాజపా ప్రతివిమర్శ చేస్తోంది. తెరాస, భాజపా వైఫల్యం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఎంతకైనా పోరాడి కోచ్‌ ఫ్యాక్టరీ సాధిస్తామని చెబుతోంది.

kazipet Coach Factory issue during the MLC elections in telangana
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కోచ్‌ ఫ్యాక్టరీ రగడ

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కోచ్‌ ఫ్యాక్టరీ రగడ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో...విభజన చట్టంలో ఇచ్చిన హామీలు...నేతలకు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో రైల్వేకోచ్ ఏర్పాటుపై ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గి తెలంగాణ పట్ల కేంద్రం మరోసారి వివక్ష చూపుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ అవసరం లేదన్న వైఖరిని కేంద్రం ప్రభుత్వం మార్చుకోక పోతే... రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై తెరాస ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తారని తెలిపారు. ఉద్యోగాలపై గగ్గోలు చేస్తున్న భాజపా నేతలు.. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తే కొత్త నియామక ప్రకటనలు ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను భాజపా ఇంకెంత కాలం మోసం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రాకుండాపోతుంటే.. ఏం చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ భాజపా నేతలను ప్రశ్నించారు.

అప్పుడు స్పందించకుండా..

తెరాస వల్లే కోచ్‌ తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీ రాకుండా పోయిందని భాజపా ఆరోపిస్తోంది. సరైన సమయంలో స్పందించకుండా...ఇప్పుడు విమర్శలు చేయడమేంటని....భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెరాస నేతలను ప్రశ్నించారు.

రెండూ విఫలం

ఫ్యాక్టరీ సాధన విషయంలో... భాజాపా, తెరాస రెండూ విఫలమైయ్యాయని...కాంగ్రెస్‌ విమర్శించింది. కోచ్ ఫ్యాక్టరీపై రైల్వే శాఖ ప్రకటనను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఎప్పటికైనా కాంగ్రెస్‌తోనే కోచ్‌ ఫ్యాక్టరీ సాధ్యమని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీల నేతలతోపాటుగా... పలు సంఘాలు, నగరాభివృద్ధిలో భాగస్వాములైన సంస్థలూ...కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశంపై భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రచిస్తున్నాయి.


ఇదీ చూడండి :తెరాసకు ఓటు వేస్తే చెప్పుకు వేసినట్లే: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details