కార్తిక మాసం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు - వేయి స్తంభాల గుడిలో కార్తిక పూజలు
కార్తిక మాసం ప్రారంభం అవడంతో వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆలయాలు.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి సోమవారం సందర్భంగా వేయి స్తంభాల గుడిలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తికం: వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు
ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి:భూమిని చదును చేస్తుండగా... ఓ అరుదైన విగ్రహం!