తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశ రక్షణకే సీఏఏ: ఎంపీ బండి సంజయ్​ - NRC

దేశ రక్షణ కోసం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొస్తే.. కొన్ని పార్టీలు అనవసర ఆందోళనలకు తెర లేపుతున్నాయని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా వరంగల్​లో చేపట్టిన  మహా ప్రదర్శనలో పాల్గొన్నారు.

karimnagar mp bandi sanjay on caa in warangal
దేశ రక్షణకే సీఏఏ: ఎంపీ బండి సంజయ్​

By

Published : Jan 8, 2020, 7:19 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన చేపట్టారు. జాతీయవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగిన ఈ మహా ప్రదర్శనలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, భాజపా శ్రేణులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

ముస్లింకు ఎలాంటి నష్టం లేదు

దేశ రక్షణ కోసం పౌరసత్వ సవరణ చట్టం తీసుకువస్తే... కొన్ని పార్టీలు అనవసర ఆందోళనలకు తెర లేపుతున్నాయని సంజయ్​ మండిపడ్డారు. ఓట్ల కోసం చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పారు.

దేశ రక్షణకే సీఏఏ: ఎంపీ బండి సంజయ్​

ఇదీ చూడండి: తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్​ సమావేశం

ABOUT THE AUTHOR

...view details