వైద్య వృత్తిలో నర్సింగ్ సేవలు అత్యంత కీలకమైనవని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో వివిధ నర్సింగ్ కళాశాలల బోధనా సిబ్బందితో నర్సింగ్ అంశంపై అధ్యయన సమావేశం నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యంతో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ సిబ్బంది కొరత ఉందన్నారు. నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్లకు అత్యుత్తమమైన ప్రమాణాలతో బోధన అందించి ఏ పరిస్థితులోనైన వారు సమర్థంగా విధులు నిర్వహించేలా తీర్చిదిద్దాలని సూచించారు.
"వైద్యవృత్తిలో నర్సింగ్ సేవలు అత్యంత కీలకం" - skills
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నర్సింగ్ సిబ్బంది కొరత ఉందని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు నైపుణ్యంతో పాటు సేవా చేయాలనే ఆలోచనను వారి మనస్సు రేకెత్తించాలని వెల్లడించారు.
నర్సింగ్ సేవలు అత్యంత కీలకం