కాళోజీ 105వ జయంతిని హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ కూడలిలోని ఆయన విగ్రహానికి జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నగర పోలీస్ కమిషనర్ డా.విశ్వనాధ్ రవీందర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని కాళోజీ కవితలు ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా కాళోజీ జయంతి వేడుకలు నిర్వహిస్తుందని చెప్పారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజీ విగ్రహం ముందు నినాదాలు చేశారు.
వరంగల్లో కాళోజీ జయంతి
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాళోజీ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని కాళోజీ కూడలిలోని ఆయన విగ్రహానికి జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నగర పోలీస్ కమిషనర్ డా.విశ్వనాధ్ రవీందర్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పూమ మాల వేస్తున్న జడ్పీ ఛైర్మన్