తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్‌ పర్యటనలో కడియం శ్రీహరి ఆతిథ్యం తీసుకోనున్న సీఎం కేసీఆర్‌ - Kadium Srihari will be hosting the cm kcr

వరంగల్​ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి సీఎం కేసీఆర్​.. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్​ లక్ష్మీ కాంతారావు ఇంట్లో ఆతిథ్యం తీసుకునేవారు. కానీ ఈ సారి ఆయన తన పంథా మార్చుకున్నారు. రేపు కేసీఆర్​ వరంగల్​ పర్యటన సందర్భంగా సీఎం.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించనున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్​ రాజకీయాల్లో ఇది హాట్​ టాపిక్​గా మారింది.

kcr will take the kadium srihari host
కడియం శ్రీ హరి ఆతిథ్యం తీసుకోనున్న కేసీఆర్​

By

Published : Jun 20, 2021, 3:26 PM IST

Updated : Jun 20, 2021, 4:47 PM IST

రేపు వరంగల్‌ పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్‌.. మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించనున్నారు. గతంలో వరంగల్‌ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కేసీఆర్.. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ఇంట్లో బస చేసేవారు.

సీఎం.. కడియం ఆతిథ్యం స్వీకరిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కడియంను పక్కన పెడుతున్నారని త్వరలోనే ఆయన భాజాపాలో చేరుతారనే ప్రచారం ఇటీవల భారీగా జరిగింది. తెరాసను వీడి భాజపాలో చేరిన ఈటల రాజేందర్‌ను కడియం శ్రీహరి విమర్శించడంతో ఆ ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనకు కడియం ఆతిథ్యం ఇస్తుండటంతో మళ్లీ ఎమ్మెల్సీ ఇవ్వటంతో పాటు ప్రాధాన్యత గల పదవి ఖాయమన్న చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి:AADHAR,PAN: ఆధార్, పాన్ వివరాలివ్వండి.. రూ. 500 తీసుకెళ్లండంటున్న ముఠా..?

Last Updated : Jun 20, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details