Kadiyam Srihari Feels Insulted: నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికలప్పుడు వస్తున్నారు.. సాయం అడుగుతున్నారు.. కాని ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాలకు పిలవడం లేదని కడియం శ్రీహరి ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా స్థానిక నాయకత్వం బేఖాతరు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఎందుకు ఆత్మీయ సమావేశాలకు రావడం లేదని పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారని చెప్పారు. అందుకే నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరికీ ఈ విషయం తెలియాలని సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా.. గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే రాజయ్య గెలుపునకు సహకరించానని తెలిపారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా నిస్వార్థంగా పని చేశానని వివరించారు.
పెద్ద పెద్ద సభలు, ఎన్నికలు వచ్చినప్పుడు, సమావేశాలు నిర్వహించినప్పుడు మాత్రమే సహాయం కోసం వస్తున్నారని.. ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా తనకు ఇప్పటివరకు ఆహ్వానం అందలేదని అసహనం వ్యక్తం చేశారు. అన్ని విషయాలను పక్కన పెట్టి.. అందరం కలిసి కేసీఆర్ సమక్షంలో పనిచేయాలని పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి సూచించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను ఉపయోగించుకోపోతే.. పార్టీ మనుగడ కోల్పోతుందన్నారు. పార్టీల్లో నాయకుల మధ్య ఉన్న చిన్నచిన్న అభిప్రాయ భేదాలను సరిదిద్దుకోపోతే.. పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలని వివరించారు.
"ఎన్నికలప్పుడు వస్తున్నారు సాయం అడుగుతున్నారు. కాని పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలవడం లేదు. ఈ విషయం నా నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ గమనిస్తుంది. ఎందుకు కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనడం లేదని అందరూ అనుకుంటారనే నేను ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసి.. జరిగింది చెప్పుతున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనాలను మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే.. పార్టీలో ఉన్న చిన్నచిన్న అభిప్రాయ భేదాలను సరిదిద్దుకోపోతే పార్టీకి పెద్ద నష్టమే తెచ్చిపెడుతుంది. ఇప్పటికైనా ఈ విషయంపై ఆలోచన చేయాలి."- కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ
నియోజకవర్గంలో జరిగే ఏ సమావేశాలకు.. పార్టీ అధిష్ఠానం పిలవడం లేదు ఇవీ చదవండి: