తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన న్యాయమూర్తి

judge delivery in govt hospital: సాధారణంగా సర్కారు దవాఖానాకు వైద్యం కోసం ఆర్థికంగా వెనుకబడినవారు వెళ్తారు. ప్రభుత్వ అధికారులు, సంపన్నవర్గాల వారు వెళ్లడం అరుదు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ న్యాయమూర్తి పాపకు జన్మనిచ్చారు.

By

Published : Dec 13, 2022, 5:14 PM IST

warangal
warangal

judge delivery in govt hospital:హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో న్యాయమూర్తి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న జిల్లా జూనియర్ సివిల్ జడ్జి శాలిని హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. న్యాయమూర్తికి వైద్య పరీక్షలు చేసి శాస్త్ర చికిత్స చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

హన్మకొండ తమ స్వస్థలమని, ప్రతినెల వైద్య పరీక్షల కోసం వస్తానని... గతంలో ఇక్కడ కోర్టులో విధులు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమెకు వైద్యులు కేసీఆర్ కిట్ అందజేశారు. సర్కారు దవాఖానలో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ఆ నమ్మకంతోనే ఇక్కడ అడ్మిట్ అయినట్లు జడ్జి శాలిని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details