ప్రముఖ పుణ్యక్షేత్రం వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో దర్శనాలను నేటి నుంచి పది రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 12 వరకు ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరగవని ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు.
ఐనవోలు ఆలయంలో పదిరోజుల పాటు దర్శనాల నిలిపివేత - inavolu temple news
కరోనా విజృంభిస్తోన్న దృష్ట్యా వరంగల్ అర్బన్ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో పదిరోజుల పాటు దర్శనాలు నిలిపివేశారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా అర్చకులతో ఏకాంతంగా నిర్వహిస్తామని, దర్శనాలకు మాత్రం ఎలాంటి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు.
inavolu temple will locked till 10 days
ఐనవోలులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున... దేవాలయ అర్చకులు, సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా అర్చకులతో ఏకాంతంగా నిర్వహిస్తామని, దర్శనాలకు మాత్రం ఎలాంటి అనుమతి ఉండదన్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.