తెలంగాణ

telangana

ETV Bharat / state

అనంతసాగర్​లో.. మట్టిని ఫిల్టర్ చేసి ఇసుకగా విక్రయం

మట్టిని నీటితో ఫిల్టర్ చేసి ఇసుకగా విక్రయించి మోసానికి పాల్పడుతున్న సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం అనంతసాగర్​లో చోటుచేసుకుంది. అధికారులకు మొరపెట్టుకున్న స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉండటం వల్ల వారూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

By

Published : Feb 15, 2021, 4:27 PM IST

illegal sand transport in warangal urban district
అనంతసాగర్​లో.. మట్టిని ఫిల్టర్ చేసి ఇసుకగా విక్రయం

ఇసుకకు ఉన్న డిమాండ్​ను ఆసరాగా చేసుకుని మట్టిని ఇసుకగా మార్చి విచ్చల విడిగా విక్రయాలు సాగిస్తున్నారు. మట్టిని నీళ్లతో ఫిల్టర్ చేసి సాగిస్తున్న అక్రమ ఇసుక వ్యాపారం వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తుంది. మట్టిలో నుంచి తీసే ఇసుక.. నాణ్యత లేకున్నా వినియోగ దారులకు విక్రయించి మోసానికి పాల్పడుతున్నారు.

హసన్​పర్తి మండలం అనంతసాగర్ సమీపంలో ఓ ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో ఎలాంటి అనుమతి లేకుండా రైతుల నుంచి పొలాలను లీజుకు తీసుకుని ఓ వ్యాపారి దర్జాగా అక్రమ ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలోని వాగు పక్కన ప్రభుత్వ భూమిలో ఇసుక దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాగుల్లో ఇసుక నిల్వ కరువు అవ్వడం వల్ల అక్రమార్కులు మట్టి పై దృష్టి మార్చారు. సమీపంలో పొలాలు, భూములపై కన్నేసి వారికి అనువుగా మార్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మట్టి తోడి ఇసుకగా మారుస్తున్నారు.

మట్టిని ఫిల్టర్ చేసి ఇసుకగా విక్రయం

అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిన మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఫిల్టర్ ఇసుక దందా సాగిస్తున్నారని ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తున్నారని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details