ICICI Bank Deputy Manager Gold Fraud : వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఈ ఘరానా మోసం జరిగింది. బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా రూ.8.65 కోట్ల సొమ్మును ఐసీఐసీఐ బ్యాంకు(ICICI Bank) డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ దారి మళ్లించాడు. నర్సంపేట బ్రాంచ్‌లోని ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి.. రూ.8.65 కోట్లను దోచుకున్నాడు. 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించినట్లు.. ఆడిటింగ్‌లో మోసాన్ని గుర్తించి బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తీక్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇలా కొల్లగొట్టిన సొమ్మును క్రికెట్ బెట్టింగ్(Cricket Betting)లో పోగొట్టుకున్నట్లు కార్తీక్.. పోలీసులకు తెలిపాడు. ఈ స్కాంతో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో బైరిశెట్టి కార్తీక్ గోల్డ్‌లోన్ సెక్షన్లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన గోల్డ్‌లోన్, రెన్సువల్స్, క్లోజింగ్ చూసుకుంటాడు. ఈ క్రమంలో కార్తీక్ బెట్టింగుల్లో కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆ డబ్బును ఎలా తీర్చాలో తెలియక.. బ్యాంకును మోసం చేయాలని చూశాడు. అందులో భాగంగా 128 మంది ఖాతాదారుల పేరిట బంగారం రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి.. ఏకంగా రూ.8.65 కోట్ల రూపాయలను దారి మళ్లించాడు.
Rs.8.65 Crores Money Fraud Case : బంగారం రుణ ఖాతాదారులు లోన్ తీర్చిందుకు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని వారి బంగారం తిరిగి ఇచ్చేవాడు. అయితే లోన్ అకౌంట్ క్లోజ్ చేసేవాడు కాదు. ఆయా ఖాతాల్లో నెలనెల వడ్డీ జమచేసేవాడు. ఖాతాదారుల డబ్బులు తన బినామీ ఖాతాలో వేసుకునేవాడు. దీంతో ఖాతాదారులు ఎవరు ఫిర్యాదు చేయలేదు. బ్యాంకులో గోల్డ్ ఖాతా ఇంకా చెలామణిలోనే ఉన్నట్లు చూపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఆ తరువాత నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, ఇతర సిబ్బంది సంతకాలను ఫోర్జరీ చేసి.. దాదాపు రూ.8.65 కోట్లను దోచుకున్నాడు.