అసహనంతోనే నల్గొండలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(attack on bandi sanjay in nalgonda)పై.... తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender) ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఎంతమాత్రం సరికావన్నది ముఖ్యమంత్రి గ్రహించాలని హితవు పలికారు. ఇలాంటి దాడులెన్ని జరిగినా... భాజపా నేతలు, కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల(Huzurabad MLA Etela Rajender) .. సీఎం కేసీఆర్ పాలనను ఎండగట్టారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపెడుతోందని.. తెరాస నేతల ఆరోపణలను ఈటల తోసిపుచ్చారు. ఏదైనా కేంద్రాన్ని అడిగేదాన్ని బట్టే ఉంటుందని అన్నారు. కేవలం ఓ బోర్డు పెట్టినంత మాత్రాన వైద్యకళాశాలలు మంజూరు చేయరని... వాటికి ప్రత్యేక విధి విధానాలుంటాయని తెలిపారు.
అసహనంతోనే తెరాస నేతలు.. నల్గొండలో బండి సంజయ్‌పై దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు సరికాదు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇలాంటి దాడులెన్ని జరిగినా భాజపా నేతలు, కార్యకర్తలు భయపడరు. -ఈటల రాజేందర్, హుజూరాబాద్ భాజపా ఎమ్మెల్యే
ముడి బియ్యం ఇవ్వండి
ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడం లేదని.. ఉప్పుడు బియ్యానికి బదులుగా ముడి బియ్యం(paddy procurement in telangana) ఇవ్వమని చెబుతోందని ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender) అన్నారు. మొండి వైఖరికి పోకుండా.. రైతులకు అన్యాయం జరగకుండా ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంకేతికత సాయంతో.. నూకలు రాకుండా ధాన్యాన్ని ఆడించే మిల్లులు అందుబాటులోకి తీసుకురావాలని ఈటల(Huzurabad MLA Etela Rajender) అన్నారు. వరి వేస్తే ఉరి అని బెదిరింపులకు పోకుండా.. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు చేయాలని అభిప్రాయపడ్డారు. రాగులు, సజ్జలు, కొర్రలకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని.. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
బెదిరింపులకు పాల్పడ్డారు