వరంగల్ అర్బన్ జిల్లాలో జోరు వాన - ప్రధాన రహదారి
వరంగల్ అర్బన్ జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. చాలా రోజులకు వరుణుడు కరుణించడం వల్ల రైతన్నలు ఆనందంలో మునిగిపోయారు. వరంగల్ అర్బన్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది.
వరుణుడి కరుణతో ఆనందంలో అన్నదాతలు
హన్మకొండ, కాజీపేట, వరంగల్లో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఖాజీపేట, ధర్మాసాగర్, వేలేరు మండలాల్లోనూ వర్షం కురిసింది. ఖాజీపేట మండలం మడికొండలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు చెరువును తలపించింది. ఎన్నో రోజుల విరామం తర్వాత కురుస్తున్న మోస్తరు వర్షాలకు రైతులుఆనందంలో మునిగిపోయారు.