వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆలయ నిర్వాహకులు హుండీతో పాటు, వేలం, టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయన్ని లెక్కించారు.
కొత్తకొండ వీరభద్రస్వామికి.. భారీ ఆదాయం! - హుండీ లెక్కింపు
బ్రహ్మోత్సవాలు ముగియడంతో వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అధికారులు.. హుండీ లెక్కింపు చేపట్టారు. గత సంవత్సరం కంటే ఈసారి 6లక్షల 81వేల అదనపు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
కొత్తకొండ వీరభద్రస్వామికి.. భారీ ఆదాయం!
మొత్తం రూ. 87లక్షల 61వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈసారి 6లక్షల 81వేల అదనపు ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హృదయం సమర్పయామి!