వరంగల్ నగరంలో నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పుట్టినరోజు కావడం వల్ల భద్రకాళి ఆలయానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రయినా తిరిగి రాలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం రాత్రి 11 గంటల తర్వాత యువతి మృతదేహాన్ని గుర్తించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. పుట్టినరోజునే తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి.