కరోనా పరీక్షల కోసం కేంద్రాల వద్ద ఉదయం నుంచి అనుమానితులు బారులు తీరుతున్నారు. వరంగల్ నగరంలోని మున్సిపల్ అతిథి గృహం వద్ద ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం వచ్చి ఎదురు చూస్తున్నారు.
కరోనా పరీక్షా కేంద్రాల వద్ద బారులు.. లైన్లలో చెప్పులు, బాటిళ్లు!
కొవిడ్ అనుమానితులతో పరీక్షా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా లైన్లలో నిలబడలేక చెప్పులు, బాటిళ్లను పెట్టి చెట్ల నీడలో సేద తీరుతున్నారు.
కరోనా పరీక్షా కేంద్రాల్లో జనం బారులు, వరంగల్ కొవిడ్ పరీక్షా కేంద్రాలు
ఎండ తీవ్రత కారణంగా వరుసలో నిలబడలేక చెప్పులు, నీళ్ల బాటిళ్లు, సంచులను లైన్లలో పెట్టి... చెట్ల నీడలో సేద తీరుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటవరకే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ నయమైనా జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే ముప్పె!