వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వీచిన ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తీవ్రమైన గాలుల కారణంగా కొన్ని చోట్ల చెట్లు విరిగి ఇళ్లపైన పడగా.. మరికొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయి దూరంగా పడ్డాయి.
బీభత్సం సృష్టించిన గాలివాన - గాలివాన బీభత్సం
వరంగల్ పట్టణ జిల్లా కడిపికొండ గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలులు తీవ్రంగా వీయడం వల్ల చెట్లు విరిగి ఇండ్లపై పడ్డాయి. కొన్ని చోట్లు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
బీభత్సం సృష్టించిన గాలివాన
పెద్దపెద్ద వృక్షాలు కూడా వేర్లతో సహా వీధులలోని రోడ్లపై కూలిపోయాయి. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు కూడా తెగిపడడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చూడండి: సొంత రాష్ట్రాలకు పయనమవుతున్న వలసజీవులు