వరంగల్ నగరంలో మంగళవారం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఓరుగల్లు తడిసి ముద్దైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఏకధాటిగా కురుస్తున్న వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముసురుతో కూడిన వర్షం పడటం వల్ల నగర ప్రజలు బయటకు రావడం లేదు.
ఎడతెరిపిలేని వర్షం.. తడిసి ముద్దైన ఓరుగల్లు - వరంగల్
మంగవారం నుంచి కురుస్తోన్న వర్షానికి వరంగల్ తడిసి ముద్దైంది. హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది.
తడిసి ముద్దైన ఓరుగల్లు