నగరంలో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు - వరంగల్ రోడ్లపై నీరు
బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో వరంగల్ నగరం జలమయమైంది. రోడ్లపైకి భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగరంలో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
వరంగల్ నగరంలో బుధవారం నాడు భారీ వర్షం కురిసింది. కాజీపేట, హన్మకొండ, వరంగల్లో ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నా... సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులు జలమయమయ్యాయి. హన్మకొండ బస్టాండ్... పరిసరాల్లో రోడ్లపై మోకాల్లోతు నీళ్లు చేరాయ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయ్.