వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం సుప్రభాత సేవతో మెుదలై గణపతి పూజ, రుద్రాభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు చేస్తారు.
సాయంత్రం రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరీదేవి కళ్యాణమహోత్సవం ఘనంగా జరిపిస్తారు. లింగోధ్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.
హర హర 'మహారాత్రి'
ఓరుగల్లు అంటే ముందుగా గుర్తొచ్చేది కాకతీయుల చరిత్రాత్మక కట్టడాలు. హన్మకొండ వేయిస్తంభాల గుడిని నిత్యం వేలాదిగా భక్తులు, పర్యాటకులు సందర్శించి, కోరిన కోర్కెలు తీర్చే రుద్రేశ్వరస్వామిని పూజిస్తారు.
ఉదయం సుప్రభాత సేవతో మెుదలై గణపతి పూజ, రుద్రాభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు
ఇవీ చదవండి:కాంగ్రెస్ ఆందోళన
Last Updated : Mar 4, 2019, 6:27 AM IST