తెలంగాణ

telangana

ETV Bharat / state

Omicron in Hanamkonda: 'ఒమిక్రాన్​ బాధితురాలిలో ఎటువంటి లక్షణాలు లేవు.. కానీ జాగ్రత్త అవసరం' - omicron in hanamkonda

Omicron in Hanamkonda: హనుమకొండ జిల్లాలో ఒమిక్రాన్​ కేసు వెలుగుచూడటం స్థానికులను కలవరపెడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. హనుమకొండలో ఒమిక్రాన్ కేసు బాధిత మహిళ సంబంధీకులు మొత్తం 26 మందిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామని... జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి లలితాదేవి చెప్పారు. బాధిత మహిళలో కానీ, ఆమె కుటుంబసభ్యుల్లో కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. మహిళ నివిసించే ఇంటి చుట్టుపక్కల వారికీ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. కొవిడ్​ వ్యాక్సిన్​ పట్ల ఉన్న అపోహలను పక్కనపెట్టి ఇప్పటివరకూ టీకా వేసుకోని వారంతా స్వచ్చందంగా ముందుకురావాలంటున్న డీఎమ్​హెచ్​ఓ లలితాదేవితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

omicron cases in hanamkonda
హనుమకొండలో ఒమిక్రాన్ కేసులు

By

Published : Dec 17, 2021, 4:58 PM IST

హనుమకొండలో ఒమిక్రాన్​ కేసును ఎలా గుర్తించారు.?

Omicron in Hanamkonda: ముప్పు ఉన్న దేశాల నుంచి ప్రతి రోజూ ప్రయాణికుల జాబితా వస్తుంది. ఇప్పటి వరకూ 55 మంది విదేశాల నుంచి వచ్చారు. వారికి ఆర్టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహించాం. ఒమిక్రాన్​ నిర్ధరణ అయిన మహిళ యూకే నుంచి వచ్చారు. వెంటనే బాధిత మహిళతో పాటు ఆమె కుటుంబీకులను ఐసోలేషన్​కు తరలించాం.

ఒమిక్రాన్​ నేపథ్యంలో జిల్లా ప్రజలకు మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి.?

అందరూ మాస్కు ధరించాలి. వ్యాక్సిన్​ తీసుకోవాలి. టీకా వేసుకోని వారంతా అపోహలు పక్కన పెట్టి తప్పనిసరిగా వ్యాక్సిన్​ వేయించుకోవాలి. రానున్న పండుగల దృష్ట్యా ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.

ఒమిక్రాన్​ బాధితురాలిలో ఎటువంటి లక్షణాలు లేవు: డీఎమ్​హెచ్​ఓ

ఇదీ చదవండి:Bhuvanagiri Govt doctors negligence : సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం.. కుట్లు పెకిలి నరకయాతన

ABOUT THE AUTHOR

...view details