వరంగల్ నగరంలో ఓ చిత్రకారుడు అందమైన బొమ్మలు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. వినోద్‌కి చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. హన్మకొండలోని పలు కూడళ్ల వద్ద 150 రూపాయలకు మనిషి బొమ్మ వేస్తూ నాలుగు పైసలు సంపాదించుకుంటున్నాడు. రోజుకు 5, 6 బొమ్మలు వేస్తానని చెబుతున్నాడు. వినోద్ ఆర్ట్‌కి స్థానికులు ఫిదా అవుతున్నారు. ఎంతో ఆసక్తితో తమ బొమ్మలను వేయించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తను మరింత అందమైన బొమ్మలు వేస్తూ రాష్ట్రానికి పేరు తీసుకొస్తానని చెబుతున్నాడు.
మీరు బొమ్మ వెయించుకుంటారా?
మనుషులను ఎదురుగా కూర్చోబెట్టుకుని వారి బొమ్మను ఎంతో అందంగా వేస్తున్నాడు వినోద్ అనే చిత్రకారుడు. వరంగల్ నగరంలో రోజుకు 5 నుంచి 6 బొమ్మలు వేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
చిత్రం వేస్తున్న వినోద్