75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలకు గుర్తుగా నిర్వహించనున్న 'ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు' శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వరంగల్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారని అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సంబంధిత ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
'శుక్రవారం ఉదయం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు గవర్నర్ ప్రత్యేక విమానంలో రానున్నారు. కొంత సమయం తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్‌కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు ఉత్సవాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తారు.' అని కలెక్టర్ తెలిపారు.