హన్మకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆకస్మికంగా సందర్శించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 15న పాఠశాలలు మూతపడ్డాయి. జూన్‌లో మొదలుకావాల్సిన పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరవుతుండడం, సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్న తరుణంలో దాస్యం వినయ్‌భాస్కర్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులతో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ - వరంగల్ వార్తలు
సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్న తరుణంలో హన్మకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సందర్శించారు. పాఠశాలకు సంబంధించిన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుందన్నారు. క్షేత్రస్థాయిలో స్థితిగతులు తెలుసుకునే ఉద్దేశంతో మర్కజి పాఠశాలను సందర్శించామన్నారు. పాఠశాలకు సంబంధించిన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా అందించడానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని అన్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఉపాధ్యాయులకు సూచించారు.
ఇవీ చూడండి: వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయండి: భట్టి