డబ్బులు చెల్లించి రెండేళ్లు గడుస్తున్నా రెండోవిడత గొర్రెల పంపిణీ చేపట్టడం లేదని గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై గొల్లకురుమల రాస్తారోకో
రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఐనవోలు మండలం పంథినిలో గొల్లకురుమలు ఆందోళన చేశారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై గొల్లకురుమల రాస్తారోకో
ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారికి గొర్రెలను అందించాలని వేడుకున్నారు. జాతీయ రహదారిపై ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులకు గొల్లకురుమలకు వాగ్వాదం జరిగింది. ఎంత చెప్పిన వినకపోవడంతో ఆందోళన కారులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.
ఇదీ చూడండి:కరోనా నిబంధనలతో.. శాసనసభ, మండలి సమావేశాలు