ఐదురోజుల పాటు గణపతి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు - ganapathi temple
వరంగల్ అర్బన్ జిల్లాలోని గణపతి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజు పాటు జరిగే ఈ వేడుకలకు ఆలయ కమిటి అన్ని ఏర్పాట్లు చేసింది.
వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట్ విష్ణుపురిలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో వసంతోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు హాజరయ్యారు. ఆలయ పురోహితులు నగర మేయర్‌కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన పురోహితులు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి ఆలయ విశిష్టతను భక్తులకు వివరించారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతలతో నృత్య ప్రదర్శన, గాత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.