ఉప ఎన్నిక వస్తేనే ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని మాజీ ఈటల రాజేందర్(Etela Rajender) అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో పర్యటించారు. ఉప ఎన్నిక రాగానే కుల సంఘాల భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. తనను ఓడించటానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని చెప్పారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కుట్ర చేశారని ఈటల అన్నారు. తెరాస నేతలు తన ప్రత్యర్థికి డబ్బులు పంపించారని ఆరోపించారు.
సిద్దిపేటలో హరీశ్‌రావు చేసినట్లే తానూ హుజూరాబాద్‌లో చేశానని ఈటల రాజేందర్ చెప్పారు. తెరాస నేతలు ఇచ్చే డబ్బు తీసుకోండి, మనస్సాక్షి ప్రకారం ఓటేయండని ఓటర్లకు సూచించారు. తనతో పాటు హరీశ్ రావు కోరలు పీకాలని కేసీఆర్ చూశారని అందుకే తనకు, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని భావించారని తెలిపారు. మెజార్టీ సాధించి కూడ 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయలేదని ఈటల గుర్తు చేశారు. పార్టీ హక్కుల గురించి నేను గళమెత్తిన తర్వాతే హరీశ్‌కు పదవి ఇచ్చారని ఈటల వ్యాఖ్యానించారు.