తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్ని ప్రమాదం...దగ్ధమైన వరి, గడ్డి కుప్పలు - WATER TANKER

గుర్తు తెలియని వ్యక్తి పెట్టిన సెగ వరి కుప్పలకు తగిలింది. వరంగల్ అర్బన్ జిల్లాలోని పంట పొలాల్లో ఉన్న వరి, గడ్డి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. రైతులకు పెద్ద ఎత్తున నష్టం సంభవించింది.

సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం

By

Published : May 3, 2019, 7:12 PM IST

పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ శివారు హసన్ పర్తిలో చోటుచేసుకుంది. పొలాల్లో ఉన్న వరి, గడ్డి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సీతంపేటకు చెందిన యాదయ్యకు చెందిన ధాన్యం మంటలకు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నీటి ట్యాంకర్​​తో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలిగించిన అకస్మిక నిప్పు

ABOUT THE AUTHOR

...view details