మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణలు తలెత్తాయి. వరంగల్లోని 34వ డివిజన్లో తెరాస నాయకులు దౌర్జన్యానికి దిగారు. భాజపా కార్యకర్తల చొక్కాలను చించివేశారు. పోలీసులు ముందే ఇంత జరుగుతున్నా స్పందించకపోవడంతో అనేక విమర్శలు వస్తున్నాయి.
పుర ఎన్నికల్లో ఉద్రిక్తత... భాజపా, తెరాస నాయకుల మధ్య ఘర్షణ
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస నాయకులు భాజపా కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. వారి దుస్తులను చించివేశారు. పోలీసుల ముందే ఇదంతా జరుగుతున్న చోద్యం చూస్తూ నిలబడ్డారు. పోలీసులు తీరు పలు విమర్శలకు తావిస్తోంది.
వరంగల్ ఎన్నికల్లో తెరాస , భాజపా నాయకుల ఘర్షణలు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కనుసన్నల్లోనే తెరాస నాయకులు అరాచకాలను సృష్టిస్తున్నారని భాజపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సమక్షంలోనే వారి దుస్తులు చించుతూ రెచ్చిపోయారు. అలాగే 16వ డివిజన్లో పోలీసులు అత్యుత్సాహంతో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన భాజపా అభ్యర్థి బంధువు చొక్కాను విడిపించడం వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా ఇస్లామిక్ కళాశాల వద్ద చోటు చేసుకున్న ఘటనను సీపీ తరుణ్ జోషి పరిశీలించారు.
ఇదీ చూడండి:గ్రామాల్లో స్వీయ నిర్బంధం... పట్టణాల్లో ఆంక్షలు
Last Updated : Apr 30, 2021, 1:51 PM IST