తెలంగాణ

telangana

ETV Bharat / state

లలితాత్రిపుర సుందరిగా ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి దర్శనం

ఓరుగల్లు భద్రకాళీ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు లలితాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చింది.

fifth day of navratri festival celebrations at bhadrakali temple in warangal
లలితాత్రిపుర సుందరిగా ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి దర్శనం

By

Published : Oct 21, 2020, 1:09 PM IST

చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరంలోని భద్రకాళి దేవస్థానంలో దేవీనవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో పాటు పసుపుకుంకుమతో అభిషేకం చేశారు.

అనంతరం కాళీమాతను లలితాత్రిపుర సుందరిగా అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. భద్రకాళి శరణం మమ అన్న శరణను ఘోషతో ఆలయ ఆవరణం మారుమోగింది. ఉదయం అమ్మవారికి గంధోత్సవం నిర్వహించిన అర్చకులు సాయంత్రం దేవిని సాలంభిక (జింక) వాహనంపై ఊరేగించనున్నారు.

ఇదీ చూడండి:శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details